2000 కి.మీ పైలాన్ ఆవిష్కరించిన జగన్

2000 కి.మీ పైలాన్ ఆవిష్కరించిన జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఇవాళ్టీకి 2000 కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం గ్రామంలో జగన్ ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత 40 అడుగుల పైలాన్‌ను ఆవిష్కరించి.. మొక్కను నాటారు. అంతకు ముందు కృష్ణాజిల్లాలో తన పాదయాత్రను ముగించుకుని పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన జగన్మోహన్ రెడ్డికి ఆ జిల్లా ప్రజలు, నేతలు ఘనస్వాగతం పలికారు. ప్రజా సంకల్పయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ శ్రేణులు పాదయాత్రలు నిర్వహించాయి. గతేడాది నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర ఇవాళ్టీకి 161వ రోజుకు చేరుకుంది.