సరిగ్గా ఇదే రోజున.. జగన్ ట్వీట్

సరిగ్గా ఇదే రోజున.. జగన్ ట్వీట్

తన ప్రజా సంకల్పయాత్ర ఇవాళ్టీకి 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. "ఇదే రోజున మే 14, 2004న మన ప్రియతమ నేత రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వినూత్నమైన సంక్షేమ పథకాలతో.. జనరంజకంగా రాష్ట్రాన్ని పాలించారు.. ఆయన దూరదృష్టి.. సంస్కరణలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాయి.. సరిగ్గా రాజన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజున నా పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. రాజన్న రాజ్యాన్ని తిరిగి తీసుకొచ్చి.. మీ అందరి జీవితాల్లో ఆనందం నింపుతానని" జగన్ ట్వీట్ చేశారు.