మరో మైలురాయి చేరుకోనున్న జగన్

మరో మైలురాయి చేరుకోనున్న జగన్

ప్రజాసమస్యలను అధ్యయనం చేస్తూ, వెలికితీస్తూ... ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. ఇక నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగుపెడుతున్నారు... మరో వైపు ఈ రోజు బాటసారిగా మరోమైలు రాయిని చేరుకోన్నారు వైఎస్ జగన్... 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకొని... ఏలూరు సమీపంలోని మాదేపల్లి దగ్గర 2 వేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేస్తారు జగన్. ఈ సందర్భంగా ఆయన 40 అడుగుల పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి... ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్ర కూడా ఇదే రోజు... అంటే మే 14న పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగిందని, షర్మిల్ పాదయాత్ర కూడ ప.గో.లోనే కొనసాగిందనే సెంటిమెంట్‌తో పాటు, 2వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకుంటుండడంతో భారీ బహిరంగసభను ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ శ్రేణులు... ఈ సాయంత్రం ఏలూరులో జరిగే భారీ బహిరంగసభలో వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు.