నేడు పాదయాత్ర కొనసాగనుందిలా..

నేడు పాదయాత్ర కొనసాగనుందిలా..

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 228వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కొనసాగుతోంది. శనివారం ఉదయం గొల్లప్రోలు మండలం చెందుర్తి క్రాస్‌ నుంచి జగన్‌ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుండి చేబ్రోలు, దుర్గాడ క్రాస్‌ వరకూ ఈ రోజు పాదయాత్ర సాగుతుంది. ఇప్పటి వరకు పాదయాత్ర 227 రోజుల్లో 2,645.2 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.