‘దిశ’ చట్టం అమలుపై సీఎం‌ సమీక్ష..కీలక ఆదేశాలు..!

 ‘దిశ’ చట్టం అమలుపై సీఎం‌ సమీక్ష..కీలక ఆదేశాలు..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ గురువారం‌ 'దిశ' చ‌ట్టం అమ‌లుపై స‌మీక్ష సమావేశం నిర్వ‌హించారు. సమావేశంలో మ‌హిళ‌లు, చిన్నారులపై జరుగుతున్న నేరాల‌కు సంబంధించి విచార‌ణ‌కు ప్ర‌త్యేక కోర్టులు ఏర్పాట‌య్యేలా చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. క్రిమిన‌ల్ లాలో స‌వ‌ర‌ణలు చేస్తూ పంపిన బిల్లుకు ఆమోదం వ‌చ్చేలా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. దిశ చట్టాన్ని సమగ్రవంతంగా అమలు చేయాలని సూచించారు. దిశ యాప్‌ కింద వచ్చే ఫిర్యాదులకు క్వాలిటీ సేవలు అందాలని ఆదేశించారు. దిశ చట్టం, యాప్, నంబర్లకు సంబంధించిన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు, ప్రజలు ఎక్కువగా వచ్చి పోయే ప్రాంతాలు, వారు సమావేశమయ్యే చోట్ల పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. అంతే కాకుండా వీలైనంత త్వ‌ర‌గా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాలు చేయాల‌ని ఆదేశించారు.