జగన్‌ను తిట్టడం కోసమే.. మహానాడు

జగన్‌ను తిట్టడం కోసమే.. మహానాడు

మహానాడు పెట్టింది జగన్‌ను నాలుగు తిట్టడం కోసమేనన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఉన్న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతర్జాతీయ అబద్ధాలు.. మోసాలు నిన్న ముగిశాయని..దాని పేరే మహానాడు అన్నారు. ఈ వేదిక మీద అబద్ధాలు, దగా, కుట్ర, మోసాలు, వంచన, వెన్నుపోటుల్లో అంతర్జాతీయ పోటీలు జరిగాయంటూ వైసీపీ అధినేత ఎద్దేవా చేశారు. ఈ పోటీలలో వరుసగా 24 ఏళ్ల నుంచి చంద్రబాబు నెంబర్‌వన్‌గా నిలుస్తున్నారన్నారు. ప్రతీ వాక్యానికి 2 అబద్ధాలు ఆడటం మహానాడు వేదికగా శ్రేణులకు నేర్పిస్తున్నారని.. ఇదే మహానాడులో ఎన్టీఆర్‌ పుట్టినరోజున ఆయన కుర్చీని, జెండాను లాక్కొని ఎన్టీఆర్ మరణానికి బాబు కారణమయ్యారని జగన్ ఆరోపించారు. నర్సాపురాన్ని చంద్రబాబు మరచిపోయారని.. వేట సెలవులో పరిహారం ఇవ్వలేదని.. పక్కా ఇళ్లు కట్టించలేదన్నారు. 

జగన్ హామీల వర్షం:
* మత్స్యకారులకు కొత్త బోట్లు 
* వేట విరామ సమయంలో ప్రతీ మత్స్యకార కుటుంబానికి 4వేల నుండి రూ.10వేలకు పెంపు
* మత్స్యకారులు వేటకు వెళ్లి చనిపోతే రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా
* మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్
* లేసు మహిళలకు, కలంకారీ వృత్తి మహిళా కార్మికులకు నెలకు రూ.2 వేలు సహాయం