ఐపీఎల్‌ బెట్టింగ్‌ కు మరో యువకుడి ప్రాణం బలి...

ఐపీఎల్‌ బెట్టింగ్‌ కు మరో యువకుడి ప్రాణం బలి...

నిజామాబాద్ రుద్రూర్ లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ ఓ యువకుడి ప్రాణం తీసుకుంది. బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చలేక చరణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్ పెట్టొద్దని బతిమిలాడినా తమ కొడుకు విన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తండ్రి. తన కొడుకు వచ్చిన పరిస్థితి ఎవరికి రావద్దని తల్లి కన్నీటి పర్యంతమవుతుంది. మొత్తం 2 లక్షల50 వేలు అప్పు చేసి బెట్టిం గ్ లో డబ్బులు కట్టాడు చరణ్. అసలు డబ్బులకు తోడు వడ్డీ సైతం భారీగా పెరిగిపోవడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఐపీఎల్‌ బెట్టింగ్‌తో ఆర్థికంగా నష్టపోయి యువత అధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.