నువ్వులేని లోకంలో నేనుండలేనని స్టేటస్ పెట్టి... ఆ యువకుడు...!!
ఓ అమ్మాయిని ఆ అబ్బాయి ఘాడంగా ప్రేమించాడు. ఆ అమ్మాయిని విడిచి ఉండలేనంతగా ప్రేమించాడు. అయితే, ఆ అమ్మాయి కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. యువతి మృతి చెందడంతో ప్రేమించిన యువకుడు తట్టుకోలేకపోయాడు. ఈరోజు ఉదయం ఆ యువకుడు అమ్మాయి సమాధి వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు ప్రియురాలు లేని లోకంలో ఉండలేనని చెప్తూ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. ఆ స్టేటస్ చూసిన వెంటనే స్నేహితులు కుటుంబానికి సమాచారం అందించారు. స్నేహితులు, కుటుంబసభ్యులు వచ్చే సరికి ఆ యువకుడు మరణించాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)