చెల్లెలిపై చాడీలు చెప్పాడని... ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన అన్న...

చెల్లెలిపై చాడీలు చెప్పాడని... ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన అన్న...

చెల్లెలిపై చాడీలు చెప్పి ఆమె మరణానికి కారణమయ్యాడని అన్న ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు.  ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.  ప్రకాశం జిల్లాలోని జె పంగలూరు మండలం బూదవాడ కు చెందిన తేళ్ల కోటేశ్వర రావు అనే వ్యక్తి, నాగులప్పాడు మండలంలోని అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది.  అయితే, తన చెల్లి గురించి ఆ గ్రామానికి చెందిన యల్లమందయ్యా అనే వ్యక్తి తన బావకు చాడీలు చెప్పడంతో, కోటేశ్వర రావు చెల్లి ఆత్మహత్య చేసుకుంది.  దీంతో కోటేశ్వరరావు అమ్మనబ్రోలు కు చెందిన యల్లమందయ్యపై పగ పెంచుకున్నాడు.  ఓ ఫంక్షన్ కు హాజరయ్యేందుకు అమ్మనబ్రోలు వచ్చిన కోటేశ్వరరావు, యల్లమందయ్యను హత్య చేసి పరారయ్యాడు.  దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.