ప్రేమ వ్యవహారం..! యువకుడి దారుణ హత్య

ప్రేమ వ్యవహారం..! యువకుడి దారుణ హత్య

ప్రేమ వ్యవహారం యువకుడి దారుణ హత్యకు దారితీసినట్టు తెలుస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో రాత్రి దారుణమైన ఘటన జరిగింది.. ప్రణయ్ అనే యువకుడిని గొడ్డళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు... ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ కమలాసన్‌రెడ్డి.. చుట్టుపక్కలవారిని ఆరా తీశారు.. కాగా, యువకుడి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు. ఈ హత్యతో యువకుడి కుటుంబంలో విషాదం చోటుచేసుకోగా.. బాధితుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.