విచిత్ర సంప్రదాయం: ఇంటికి ఒకరే భార్య... సోదరులంతా భర్తలే...!!

విచిత్ర సంప్రదాయం: ఇంటికి ఒకరే భార్య... సోదరులంతా భర్తలే...!!

ఒక భర్తకు ఇద్దరు ముగ్గురు భార్యలుండటం చూసాం.  కానీ, ఒక భార్యకు ఇద్దరు ముగ్గురు అంతకంటే ఎక్కువ భర్తలు ఉండటం ఎక్కడైనా చూసారా అంటే లేదని చెప్తాం.  మహాభారతంలో ద్రౌపతికి ఐదుగురు భర్తలు ఉంటారు.  అది పురాణం కాబట్టి వినడానికి బాగుంటుంది.  కానీ, రియల్ లైఫ్ లో ఇలాంటి విషయాలు చాలా భయంకరంగా ఉంటాయి.  మన సంప్రదాయం ప్రకారం ఇలాంటి వాటిని నేరంగా భావిస్తారు.  కానీ, నేపాల్ లోని ఓ ప్రాంతంలో దీనిని ఆచారంగా పాటిస్తూ వస్తున్నారు.  

నేపాల్ లోని ఉత్తర ప్రాంతంలో ఉండే  డొల్పా లో ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.  వందలాది సంవత్సరాలుగా ఈ సంప్రదాయం అక్కడ ఉందట.  ఇది చైనా సరిహద్దు ప్రాంతం కావడంతో చైనాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ సంప్రదాయం అమలులో ఉన్నది.  ఒక కుటుంబంలోని సోదరుల్లో పెద్ద సోదరుడు వివాహం చేసుకున్న యువతిని మిగిలిన సోదరులు కూడా వివాహం చేసుకుంటారు.  ఆమె ఆ ఇంట్లో ఉండే సోదరులందరికి కూడా భార్యగా ఉంటుంది.  కుటుంబాన్ని పోషించే బాధ్యత, డబ్బుపై అధికారం ఆమెకు ఉంటుంది. 

భర్తలు పనిచేసి డబ్బు సంపాదించాలి.  ఆమెపై లైంగికంగా అందరికి సమాన హక్కులు ఉంటాయి.  పేదరికం వలన ఇలాంటి సంప్రదాయం పాటిస్తున్నారని తెలుస్తోంది.  ఒక భర్త మరణిస్తే మరో భర్త ఉంటారు కాబట్టి ఇంట్లో భార్య ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటుంది.  విచిత్రమైన ఈ సంప్రదాయాన్ని ఇప్పటికి అక్కడి ప్రజలు తూచా తప్పకుండా పాటించడం విశేషం.  ఇక్క ట్విస్ట్ ఏమంటే, ఒకరికంటే ఎక్కువ సోదరులు ఉండే ఇంటికి అమ్మాయిని పంపడానికి తల్లిదండ్రులు ఎక్కువగా ఇష్టపడతారట.