పెరుగుతో హైబిపికి చెక్... 

పెరుగుతో హైబిపికి చెక్... 

పట్టణాల్లో, నగరాల్లో కంటే పెరుగును పల్లెల్లో అత్యంత ఇష్టంగా తీసుకుంటారు.  ఈ విషయం అందరికి తెలిసిందే.  ప్రతిరోజూ పెరుగును ఆహారంలో తీసుకోవడం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి.  అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.  పెరుగును వారానికి ఐదు కప్పులు తీసుకునే వారిలో హైబిపి వచ్చే అవకాశం 20శాతం తక్కువగా ఉంటుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.  పెరుగు తినని వారితో పోల్చుకుంటే తినేవారు కూల్ గా ఉంటారని, టెన్షన్ కు దూరంగా ఉండటమే కాకుండా ప్రశాంతంగా ఉంటారని బోస్టన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు పేర్కొన్నారు.  ప్రతిరోజూ తప్పకుండా ఒక కప్పు పెరుగు తీసుకునే వారి ఆరోగ్యం మిగతా వారితో పోలిస్తే మెరుగ్గా ఉంటుందని అంటున్నారు నిపుణులు.