ముఖ్యమంత్రి యోగి అయోధ్య పర్యటన రద్దు..!

ముఖ్యమంత్రి యోగి అయోధ్య పర్యటన రద్దు..!

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ నేటి అయోధ్య పర్యటనను రద్దు చేసుకున్నారు. అయోధ్య మందిర నిర్మాణానికి  సంబందించిన ఏర్పాట్లను సీఎం యోగి పరిశీలించాల్సి ఉంది. అయితే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కమలా రాణి కరోనా బారినపడి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. దాంతో యోగి పర్యటనను రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 5న రామమందిర భూమి పూజ కార్యక్రమం జరగనుంది. కాగా ఆ కార్యక్రమ ఏర్పాట్లను సందర్శించడానికి ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు రామ జన్మభూమిని సందర్శించాల్సి ఉంది. అంతే కాకుండా హనుమన్‌గారి ఆలయం, రామ్‌ కి పాడి కూడా సందర్శించాల్సి ఉంది. యోగి పర్యటన రద్దు కావటంతో హనుమాన్‌గారి ఆలయం వద్ద నిషన్‌పూజను రద్దు చేశామని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ సభ్యుడు డాక్టర్‌ అనిల్‌ మిశ్రా తెలిపారు. నిషన్ పూజను మంగళవారం నిర్వహిస్తామని పేర్కొన్నారు.