హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంగా మార్చేందుకే వచ్చా : యోగి

హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంగా మార్చేందుకే వచ్చా : యోగి

ఈరోజు బీజేపీ కోసం గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు యోగి ఆదిత్యనాద్ హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన మల్కాజ్ గిరి, కూకట్ పల్లి నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించగా లాల్ దర్వాజలో బహిరంగ సభలో మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరం గా మార్చేందుకు మీ అందరితో కలిసి నడిచేందుకు వచ్చానని ఆయన అన్నారు. నిజాం ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్ లో కలపాలని చూసాడు.. ఇక్కడి ప్రజలు వ్యతిరేకంగా పోరాడారు.. వారికి మద్దతుగా సర్దార్ పటేల్ నిలిచాడు.. భారత దేశంలో విలీనం చేశారని అన్నారు.

ఇప్పటికే కొంతమంది నిజాం వారసులు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ అరాచకాలు చేస్తున్నారు.. వారికి ఈ జి.హెచ్ యం సి ఎన్నికల ద్వారా బుద్ధి చెప్పాలని అన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఎన్నో ఆటంకాలు కల్పించారు.. ఇక్కడి ప్రజలు చాలా మంది రామాలయం నిర్మాణానికి ముందుకు వచ్చారని, మోడీ రామ మందిరం నిర్మాణం కోసం భూమి పూజ చేసిన ఘనత దక్కించుకున్నారని అన్నారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పేదలకు తెరాస అందించడం లేదన్న ఆయన యూపీలో మూడు ఏళ్ల లో ముప్పై లక్షల మందికి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు అందించాము, టీఆర్ఎస్ ఆరు ఏళ్ళలో ఎంతమందికి ఇండ్లు ఇచ్చింది ? అని ఆయన ప్రశ్నించారు.

ప్రధాన్ మంత్రి పేద రైతులకు ఆరువేల రూపాయలు అకౌంట్లో జమచేస్తుండగా.. వరద సహాయాన్ని అర్హులకు టీఆర్ఎస్ అకౌంట్ ల ద్వార ఎందుకు ఇవ్వలేదు అని కెసిఆర్ ని ప్రశ్నిస్తున్నానని అన్నారు. నిజాం రూపంలో ఒక కుటుంబం హైదరాబాద్ ,తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారు, దానిని సాకరం కాకుండా‌ చూడాలని అన్నారు. బీహార్ లో నితీష్ ప్రభుత్వం ఏర్పడ్డాక, శాసన సభలో ప్రమాణం చేసే సమయంలో యంఐయం ఎమ్మెల్యే హిందుస్తాన్ అని పలకను అని అన్నాడు ఇక్కడ ఉంటూ ఇక్కడ తింటూ హిందూస్తాన్ అనను అంటున్నారు, యంఐయం నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని యోగి పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన, ఆరోగ్య బీమా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఇక్కడ ఓ కుటుంబ ఎంఐఎంతో కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తుందని ఆ దోపిడీకి వ్యతిరేకంగా జరిగే ఉద్యమం లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చానని ఆయన అన్నారు. హైదరాబాద్ ని భాగ్యనగర్ ఎలా చేస్తారు అని అడుగుతున్నారు.. యూపీ లో ఫైజాబాద్ ని అయోధ్య గా, అలహాబాద్ ని ప్రయాగ్ రాజ్ గా మార్చాం..ఇక్కడ కూడా బిజెపి అధికారంలోకి వస్తే హైదరాబాద్ భాగ్యనగరంగా పేరు మారడమే కాకుండా అభివృద్ధి జరుగుతుందని అన్నారు.