రాయ్ లక్ష్మీ ఎంగేజ్మెంట్ లో 'కరోనా' ట్విస్ట్!

రాయ్ లక్ష్మీ ఎంగేజ్మెంట్ లో 'కరోనా' ట్విస్ట్!

తెలుగు వారికి 'రత్తాలు'గా గుర్తొచ్చే రాయ్ లక్ష్మీ హిందీలోనూ కొంత మేర గుర్తింపు పొందింది. అయితే, ఎక్కడికి వెళ్లినా స్టార్ డమ్ మాత్రం అమ్మడ్ని వరించలేదు. దాంతో తన సొషల్ మీడియా అకౌంట్లో ఎంగేజ్మెంట్ సంగతి ప్రస్తావించింది! ఏప్రిల్ 27న తన భాగస్వామితో నిశ్చితార్థం అంటూ బాంబు పేల్చింది. తన ఇంట్లో వారు చాలా సంతోషంగా ఉన్నారనీ, తాను కూడా ఫుల్ హ్యాపీస్ అనీ... లక్ష్మీ రాయ్ వివరించింది. అసలు రాయ్ లక్ష్మీ లాంటి గ్లామర్ గాడెస్ ఉన్నట్టుండీ ఎంగేజ్మేంట్ అంటేనే అదో పెద్ద వార్త. కానీ, తన పోస్ట్ చివర్లో ఆమె చిన్న ట్విస్ట్ ఇవ్వటంతో విషయం మరింత క్రేజీగా మారింది. త్వరలో నిశ్చితార్థం అంటూ విషయం వివరించిన లక్ష్మీ చివర్లో మాత్రం ''ఇదంతా నేను మరొకరి దగ్గర్నుంచీ తీసుకొచ్చా. మీరు మాత్రం చేతులు శుభ్రంగా కడుక్కోండి. అవసరమైనప్పుడల్లా శానిటైజర్ వాడండి'' అని చెప్పింది! పోస్టులోని చివరి మాటలు చదివిన నెటిజన్స్ కి అసలు విషయం అర్థమై బోలెడు ఫన్నీ కామెంట్స్ పెట్టారు. కొందరు మాత్రం రత్తాలు పెళ్లి వార్త నిజమేనని నమ్మి కాంగ్రాట్స్ అంటూ కామెంట్లు వేశారు! ఇంతకీ, అమ్మడి నిజమైన పెళ్లి ఎప్పుడో!