వైసీపీలోకి యెనుముల...

వైసీపీలోకి యెనుముల...

గుంటూరు జిల్లా గురజాల మండలం జంగమహేశ్వరపురం గ్రామానికి చెందిన యెనుముల మురళీధర్ రెడ్డి వైసీపీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజాసంకల్ప యాత్రలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. ఈ సమయంలో ఆయన వెంట మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర నేత జంగా కృష్ణమూర్తి, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డితో పాటు మరికొందరు పార్టీ కార్యకర్తలు ఉన్నారు. 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన యెనుముల.. మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు.