రివ్యూ: ఏడు చేపల కథ 

రివ్యూ: ఏడు చేపల కథ 

నటీనటులు : అభిషేక్, భాను శ్రీ, మేఘనా చౌదరి, ఆయేషా సింగ్, సునీల్ కుమార్ తదితరులు 

మ్యూజిక్: కవి శంకర్

సినిమాటోగ్రఫీ: అర్లీ

నిర్మాత: శేఖర్ రెడ్డి జివిఎన్

దర్శకత్వం: సామ్ జె చైతన్య

ఇటీవల కాలంలో అడల్ట్ కంటెంట్ తో అనేక సినిమాలు వస్తున్నాయి.  ఈ అడల్ట్ అర్జున్ రెడ్డి సినిమా ఇందుకు ఓ ఉదాహరణ.  అర్జున్ రెడ్డి సినిమా తరువాత వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా కూడా మంచి విజయం సాధించింది. వీటిని స్ఫూర్తిగా తీసుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడల్ట్ కథలతో సినిమాలు తీస్తున్నారు.  అడల్ట్ కామెడీకి హర్రర్ థ్రిల్ ను జోడించి సినిమాలు తీస్తున్నారు.  ఈ కోవలో వచ్చిన సినిమానే ఏడు చేపల కథ.  ఈరోజు రిలీజైన ఈ మూవీ ఎలా ఉన్నదో తెలుసుకుందాం.  

కథ: 

హీరో అభిషేక్ తలసేమియా అనే వ్యాధితో బాధపడుతుంటారు.  దీనిని బయట పడాలి అంటే ప్రతి నెల బ్లడ్ మార్చుకుంటూ ఉండాలి  ఇక సరైనఆహరం తీసుకోవాలి.  ఆహారం కోసం దొంగతనాలు చేస్తుంటారు.  ఈ క్రమంలోనే అభిషేక్ మేల్ ప్రాస్టిట్యూట్ గా మారాడు.  అతను ఏ అమ్మాయినైతే చూసి టెంప్ట్ అవుతాడో ఆ అమ్మాయి ఆ నైట్ కు వచ్చేస్తుంది.  దీంతో హీరో అభిషేక్ కొత్త చిక్కుల్లో ఇరుక్కుంటాడు.  ఈక్రమంలో అభిషేక్ లవర్ అయేషా సింగ్ గర్భవతి అవుతుంది.  తనకు తెలియకుండానే గర్భవతి కావడంతో ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఆత్మలతో మాట్లాడే సునీల్ కుమార్ దగ్గరకి వెళ్తుంది.  సునీల్ కుమార్ కు కథకు సంబంధం ఏంటి..? అభిషేక్ ఎందుకు టెంప్ట్ అవుతుంటాడు ? దీంతో అభిషేక్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అన్నదికథ.  

విశ్లేషణ: 

సినిమాలకు అడల్ట్ +హర్రర్+కామెడీని జోడిస్తే పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేస్తాయని దర్శక నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు.  అందుకే అవసరం ఉన్నా లేకున్నా.. బూతును సినిమాలో జొప్పించి మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.  ఎంత బూతు కామెడీ ఉన్నా దానికి తగ్గట్టుగా కథ ఉండాలి.. సరైన స్క్రీన్ ప్లే ఉండాలి.. అప్పుడే సినిమా మెప్పిస్తుంది.  ఇవేమి లేకుండా ఏవో కొన్ని సీన్స్ పై ఆధారపడి సినిమాను తెస్తే ఇదుగో ఏడు చేపల కథలా మారిపోతుంది.  కొట్టడం మొదలుపెడితే ఏ పార్ట్ ఎక్కడుందో వెతుక్కోవడనికి వారం పడుతుంది అన్నట్టుగా, ఏ సీన్ ఎక్కడుందో ఎందుకుందో సినిమా చూసే పేక్షకులు కనీసం నెలరోజులు పడుతుంది.  గ్లామర్ కు, బూజుపట్టిన బూతుకు పెద్దపీఠ వేసి అసలు స్క్రీన్ ప్లే ను పట్టించుకోకపోవడంతో సినిమా చతికిలపడింది.  స్లో స్క్రీన్ ప్లే కథ చాలా నిదానంగా సాగింది.  ఇది సినిమాకు మైనస్ గా నిలిచింది.  హీరోయిన్లు తమ గ్లామర్ ఆకట్టుకున్నారు.  హీరో అభిషేక్ టెంప్ట్ రవి పాత్రలో ఆకట్టుకున్నాడు.  ఇక ఆత్మలతో మాట్లాడే వ్యక్తిగా సునీల్ కుమార్ నటనఅద్భుతంగా ఉంది.  ఆర్లి కెమెరా, కవి శంకర్ మ్యూజిక్ పర్వాలేదు.  నిర్మాణ విలువలు బాగున్నాయి.  

చివరిగా: ఏడు చేపల సినిమా : స్లోగా సాగే అడల్ట్ సినిమా