వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్..

వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్..

కడప జిల్లా జమ్మలమడుగులో రాజకీయం వేడెక్కింది. నిన్న టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పెదదండ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు వైసీపీలో చేరేందుకు ప్రయత్నించడంతో.. వారి ఇళ్లపై మంత్రి అనుచరులు దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అయితే మార్గమధ్యంలోనే వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ఎంపీతో పాటు జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సుధీర్ రెడ్డిలు రోడ్డుపై బైఠాయించారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కడప శివారులోని చింతకొమ్మదిన్నే పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పెదదండ్లూరుతో పాటు జమ్మలమడుగులో బలగాలను మోహరించారు.