మరో వైసీపీ సీనియర్ నేత మృతి

మరో వైసీపీ సీనియర్ నేత మృతి

 
కడప జిల్లాకి చెందిన మాజీ మంత్రి వైసీపీ నేత ఖలీల్ బాషా మృతి చెందారు. అనారోగ్యంతో గత వారం రోజుల క్రితం హైదరాబాద్ ఆపోలో హాస్పటల్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతి చెందారు. టీడీపీ హాయాంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఒక సారి మైనార్టీ శాఖ మంత్రిగా పని చేసిన ఖలీల్ బాషా, గత ఎన్నికల ముందు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. టీడీపీ అధిష్టానంపై ఖలీల్ అసంతృప్తితో ఉండడంతో వెంటనే రంగంలోకి దిగిన వైసీపీ నేతలు ఆయనతో చర్చలు జరిపారు. ముఖ్యంగా అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి మంత్రి అంజాద్ బాషా టచ్‌లోకి వెళ్లి వైసీపీలోకి ఆహ్వానించగా ఆయన పార్టీలో చేరారు.