కరోనాతో వైసీపీ నేత మృతి

కరోనాతో వైసీపీ నేత మృతి

ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే రెండున్నర లక్షలు దాటేసిన కరోనా కేసులు మూడు లక్షల నంబర్ వైపు పరుగులు పెడుతున్నాయి. అలాగే రోజూ వందకు దగ్గరలో కరోనా మరణాలు కూడా నమోదవుతున్నాయి. నేతలు, ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. నిన్నటికి నిన్న టీడీపీ నేత ఒకరు మరణించగా ఈరోజు వైసీపీ నేత ఒకరు కరోనా సోకి మరణించారు. ఆయన ఎవరో కాదు పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన కొవ్వూరు ఏఎంసి చైర్మెన్ యాండపల్లి రమేష్. కొవ్వూరు నియోజకవర్గంలో వైసిపి గెలుపుకు ఈయన ప్రధాన కారకులని అక్కడి క్యాడర్ చెప్పుకుంటారు. ఆయన స్వస్థలం అదే నియోజకవర్గంలోని కుమారదేవం. దీంతో కుమారదేవం గ్రామంలో విషాదం నెలకొంది. సహాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరికి  అన్ని వేళల అందుబాటులో ఉంటూ ప్రజానాయకుడని గ్రామస్తుల మన్ననలు పొందిన ఆయన మరణించడంతో పార్టీ కార్యకర్తలు దిగ్బ్రాంతికి లోనయ్యారు..