'కింగ్ ఆఫ్ రొమాన్స్' యష్ చోప్రా 88 వ జయంతి

'కింగ్ ఆఫ్ రొమాన్స్' యష్ చోప్రా  88 వ జయంతి

ప్రముఖ దర్శకుడు యశ్ చోప్రా 88వ జయంతి నేడు. కింగ్ ఆఫ్ రొమాన్స్ గా పేరుతెచ్చుకున్న యశ్ చోప్రా 27 సెప్టెంబర్ 1932న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించాడు. యశ్ తన సినీ కెరీర్ లో ఎన్నో హిట్స్ ఇచ్చాడు. ఆయన నటించిన అన్ని సినిమాలు ముఖ్యంగా రొమాంటిక్ గా ఉండేవి మరియు దీని వల్ల యశ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. యశ్ దర్శకత్వం వహించిన దాదాపు అన్ని చిత్రాలు ప్రజల హృదయాలను తాకాయి. ఆయన ఎంతో మంది హీరోయిన్స్ ను ఇండస్ట్రీ కి పరిచయం చేసారు. తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎలానో బాలీవుడ్ లో యష్ చోప్రా అలా ఎంతో మంది హీరోయిన్లు ఆయన ద్వారా పరిచయమవడమే కాక స్టార్స్ గాను వెలుగు వెలిగారు . “దేవుడు స్త్రీలను అందంగా మలిచాడు . నేను మహిళలందరినీ గౌరవిస్తాను. నేను వారిలో ‘చెడు’ చూడలేదు. దేవుని సృష్టిని మరింత అందంగా మార్చడం ద్వారా నేను నా కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను ”అని షారూఖ్ ఖాన్‌తో ఓ సందర్భంలో చెప్పారట యశ్ చోప్రా