అందుకే జగన్ ప్రభుత్వం కక్ష్య కట్టింది...

అందుకే జగన్ ప్రభుత్వం కక్ష్య కట్టింది...

యలమందా నాయక్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుంది అని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. చెన్నాయపాలెం లో సరస్వతి భూముల విషయం లో రైతుల తరుపున నాయక్ పోరాటం చేశాడు. అయితే రైతుల తరుపున పోరాటం చేశాడనే వైసీపీ, జగన్ ప్రభుత్వం కక్ష్య కట్టింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి గుండాలు అర్ధరాత్రి యలమంద నాయక్ ను కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టారు అని తెలిపారు. నాయక్ ను చంపి సాగర్ కాలువ లో పడేయాలని ప్రయత్నించారు. ఎమ్మెల్యే గూండాలకు  నాగార్జున సాగర్ ఎస్ఐ, మాచర్ల రూరల్ సిఐలు అండగా నిలిచారు అని ఆరోపించారు. యలమంద నాయక్ ఘటనపై మానవ హక్కుల కమిషన్ కు, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. కోర్టు లో ప్రైవేట్ కేసులు వేస్తాం. వైసీపీ గుండాలకు, వారికి వంతపాడే అధికారులను కోర్టు మెట్లు ఎక్కిస్తాం అని పేర్కొన్నారు.