మీరు చెప్పిన కరోనాతో సహజీవనం ఇదేనా..? : యనమల

మీరు చెప్పిన కరోనాతో సహజీవనం ఇదేనా..? : యనమల

కోవిడ్ వైరస్ కు గేట్లు ఎత్తేశారు,కరోనా నియంత్రణలో చేతులెత్తేశారని ఏపీ సీఎం జగన్ మీద టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శల వర్షం కురిపించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది ముందస్తు నియామకాల్లో వైఫల్యం, ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో వైఫల్యం సాధించి అమెరికా, బ్రెజిల్ స్థాయికి ఏపి చేరడం సిగ్గుచేటని ఆయన అన్నారు. మీరు చెప్పిన కరోనాతో సహజీవనం ఇదేనా..? అని ఆయన విమర్శించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోడానికి కూడా జగన్ సిద్దంగా లేరని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం పబ్జీ గేమ్ కాదని రోజుకు 90మంది ప్రాణాలు పోతుంటే, నిద్ర ఎలా పడుతోంది..? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన 8వేల కోట్లు ఏం చేశారు..? అని ప్రశ్నించిన ఆయన క్వారంటైన్ కేంద్రాల్లో ఆహారానికి ఎంత ఖర్చు చేశారు..? అని ప్రశ్నించారు. డిశ్చార్జ్ చేసినప్పుడు ఇస్తానన్న రూ2వేలు ఎంతమందికి ఇచ్చారు..? అని ప్రశ్నించిన ఆయన మాస్క్ ల కొనుగోళ్లకు ఎంత ఖర్చు చేశారని అన్నారు. ఆర్టీపిసిఆర్, ట్రూనాట్ పరీక్షలు ఎన్ని చేశారు..? పరీక్షలపై మొత్తం ఎంత ఖర్చు చేశారు..?. కరోనా కిట్ల కొనుగోళ్లకు ఎంత ఖర్చు చేశారు..? ‘‘మీ ఔషధం’’ బ్లీచింగ్ కొనుగోళ్లపై ఖర్చెంత..?. ఇలా కరోనా కోసం వాడిన అన్ని నిధుల వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.