రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి బాంబు పేలి...!!

రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి బాంబు పేలి...!!

రెండో ప్రపంచయుద్ధం సమయంలో దేశాలు వివిధరకాలుగా బాంబులను వియోగించారు.  అందులో వేలాది బాంబులు పేలకుండా భూమిలో ఉండిపోయాయి.  ఇప్పటి వరకు ప్రపంచం పేలని అనేక బాంబులను గుర్తించి నిర్వీర్యం చేసింది.  ఇక వియాత్నంలో రెండో ప్రపంచయుద్ధం సమయంలో ల్యాండ్ మైన్స్ ను వినియోగించారు.  ఇప్పటికి అవి అలానే ఉండిపోగా, ఎలుకలకు ట్రైనింగ్ ఇచ్చి ల్యాండ్ మైన్స్ ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.  రెండో ప్రపంచయుద్ధం సమయంలో పోలెండ్ దేశంలో 5.4 టన్నుల బరువైన బాంబులను వినియోగించింది.  అందులో పేలని ఒక బాంబును సెజిన్ నౌకాశ్రయానికి సమీపంలో 2019 సెప్టెంబర్ లో గుర్తించారు.  కాగా, దానిని అక్టోబర్ 13 వ తేదీన బాల్టిక్ సముద్రంలో సురక్షితంగా పేల్చారు.  ఈ ప్రక్రియ చేపట్టే ముందు స్థానికులను దూరప్రాంతాలకు తరలించారు.  భారీ పేలుడు పదార్ధంతో ఉన్న అతిపెద్ద బాంబు కావడంతో కట్టుదిట్టమైన భద్రతతో ఈ ప్రక్రియ చేపట్టారు.  సముద్రం అడుగున పేల్చినప్పటికీ అలలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి.  అయితే, ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు.