25న అయోధ్య వెళ్తా.. మోడీని నిలదీస్తా..

25న అయోధ్య వెళ్తా.. మోడీని నిలదీస్తా..

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన రామమందిరాన్ని నాలుగున్నరేళ్లలో ఎందుకు కట్టలేకపోయారటూ ప్రధాని మోడీని శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే ప్రశ్నించారు. ఈ విషయంపై నిలదీసేందుకు నవంబరు 25వ తేదీన అయోధ్య వెళతానన్నారు. రామాలయం నిర్మాణం విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారనే విషయంపై మోడీనే ప్రశ్నిస్తానని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత మోహన్ భగవత్ కూడా మందిర నిర్మాణాన్ని డిమాండ్‌ చేస్తున్నారని గుర్తుచేశారు. హిందుత్వం మ‌ర‌ణించింద‌ని ఆలోచించేవాళ్లను హెచ్చరిస్తున్నామన్న థాకరే.. తాము ఇంకా బతికే ఉన్నామన్నారు. ప్రజల ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని అబద్ధమాడినట్టుగా.. రామ మందర విషయంలోనూ అబద్ధమాడారా? అని మోడీని ప్రశ్నించారు. ప్రజల నమ్మకాలతో చెలగాటం వద్దని ఉద్ధవ్‌ సూచించారు. 'ఉత్తరప్రదేశ్‌ నుంచి గెలుపొందిన మోడీ.. ప్రధాని హోదాలో ఇంతవరకూ అయోధ్యలో పర్యటించకపోవడం దురదృష్టకరం' అని ఆయన అన్నారు.