వండర్‌వుమన్ యూఎస్ కన్నా ముందు చైనాలో

వండర్‌వుమన్ యూఎస్ కన్నా ముందు చైనాలో

వాషింగ్‌టన్: వండర్ వుమన్ ఈ పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరనే చెప్పాలి. డీసీ యూనివర్స్‌లోని పెద్ద హీరోల్లో వండర్ వుమన్ కూడా ఒకరు. అయితే డీసీ కొత్తగా చిత్రిస్తున్న వండర్ వుమన్ 1984 సినిమా కోసం ఎన్నాళ్లుగానో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్దమయింది. కాకపోతే ఈ సినిమా ముందుగా అంటే యూఎస్‌లో కన్నా ముందు చైనాలో రిలీజ్ కానుంది. చైనాలో ఈ సినిమా డిసెంబరు 18న విడుదల కానుంది. అంటే నార్త్‌ అమెరికా కన్నా వారం రోజుల ముందు. అయితే ఈ సినిమా హెచ్‌బీఓ మ్యాక్స్ స్ట్రీమింగ్ సర్వీస్ ద్వారా డిసెంబర్ 16న అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోకి రానుంది. అయితే సెప్టెంబరులో విడుదలయిన డిస్నీ ములాన్ తరువాత సూపర్ హీరో కథతో చైనాలో విడుదల కానున్న హాలీవుడ్ సినిమా వండర్ వుమన్. మొట్టమొదటి వండర్ వుమన్ సినిమా చైనాలో విడుదలయినప్పుడు దాదాపు 90.5 మిలియన్ల యూఎస్ డాలర్ల కలెక్షన్ చేసింది. అయితే ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 820 మిలియన్ డాలర్లు సంపాదించిన సినిమా కంటిన్యూ చేయడానికి అదే బృందం గాల్ గడాట్, పట్టీ జెన్‌కిన్స్ తీయనున్నారు. అయితే ఈ సినిమా విడుదల చైనాలోని కరోనా రికవరీని చూపుతుందని అక్కడి వారు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఎప్పుడుప్పుడు వస్తుందా అని అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ డీసీ సినిమా అయిన ప్రేక్షకుల అంచనాలను అందుకుందేమో చూడాలి.