2022 కామన్వెల్త్ గేమ్స్ లో ఉమెన్స్ క్రికెట్....

2022 కామన్వెల్త్ గేమ్స్ లో ఉమెన్స్ క్రికెట్....

చరిత్రలో మొదటిసారిగా కామన్వెల్త్ గేమ్స్ లో ఉమెన్స్ క్రికెట్ కూడా భాగం కానుంది అని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. ఐసీసీ, కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (సిజిఎఫ్) కలిపి... బర్మింగ్‌హామ్‌లో 2022 లో జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ లో 8 జట్లు పాల్గొననున్నాయి అని ప్రకటించాయి. కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల క్రికెట్ భాగం కావడం ఇదే మొదటిసారి. అయితే ఇందులో పాల్గొనాల్సిన 8 జట్లలో... ఏప్రిల్ 6, 2021 నాటికి ఐసీసీ ఉమెన్స్ టీ 20 ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉన్న 6 జట్లు అర్హత సాధిస్తాయి. అలాగే ఆతిథ్య జట్టు అయిన ఇంగ్లాండ్ మాత్రం నేరుగా అర్హత సాధిస్తుంది. ఇక 8 వ స్థానం కోసం క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగుతుంది. అందులో విజయం సాధించిన జట్టు ఈ పోటీలో భాగం అవుతుంది.