భర్త పాస్ పోర్ట్ తో ప్రియుడిని ఫారెన్ తీసుకెళ్లింది... చివరకు... 

భర్త పాస్ పోర్ట్ తో ప్రియుడిని ఫారెన్ తీసుకెళ్లింది... చివరకు... 

ఓ మహిళ తన ప్రియుడితో కలిసి ఫారెన్ ట్రిప్ వెళ్లాలని అనుకుంది.  దానికోసం తన భర్త పాస్ పోర్ట్ ను ఫోర్జరీ చేసి వినియోగించుకుంది.  ఏదోలా తంటాలు పడి ఆ మహిళ ప్రియుడితో కలిసి ఆస్ట్రేలియా వెళ్ళింది.  జనవరిలో ఆస్ట్రేలియా వెళ్లి మూడు నెలలు ఎంజాయ్ చేసి మార్చిలో తిరిగి ఇండియాకు రావాలని అనుకున్నారు.  అయితే, కరోనా కారణంగా ఆస్ట్రేలియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది.  

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు  వందే భారత్ మిషన్ ను ఇండియా ప్రారంభించిన సంగతి తెలిసిందే.  ఈ వందే భారత్ ఫ్లైట్ లో ఈనెల 24 వ తేదీన ఈ జంట ఇండియాకు వచ్చింది.  ఇండియాకు వచ్చిన వెంటనే ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  తన పాస్ పోర్ట్ ను ఫోర్జరీ చేసి ప్రియుడితో కలిసి ఫారెన్ వెళ్లిందని, మరొక వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకుందని కేసు ఫైల్ చేశాడు.  దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  ఒక వ్యక్తి పాస్ పోర్ట్ తో ఎలా విదేశాలకు వెళ్లారు అనే కోణంలో కేసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఫిలిబిత్ లో జరిగింది.