రాజధానిలో రోడ్డెక్కిన లక్షలాదిమంది మహిళలు... ఇదే కారణం 

రాజధానిలో రోడ్డెక్కిన లక్షలాదిమంది మహిళలు... ఇదే కారణం 

యూరప్ లోని పోలెండ్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.  అబార్షన్లపై నిషేధం విధిస్తు చట్టాన్ని తీసుకొచ్చింది.  అత్యాచారాలు, ప్రసవం సమయంలో తల్లిబిడ్డ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసిన సమయంలో మాత్రమే అబార్షన్లకు అనుమతించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై దేశంలోని మహిళలు మండిపడుతున్నారు.  దేశరాజధాని వార్సాలో లక్షలాది మంది మహిళలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు.  ప్రభుత్వం చేసిన చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  అయితే, ప్రభుత్వం మాత్రం దీనిపై వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేసింది.