సరికొత్త రికార్డ్: 10 గంటలపాటు చెట్టును కౌగిలించుకొని... 

సరికొత్త రికార్డ్: 10 గంటలపాటు చెట్టును కౌగిలించుకొని... 

మనం ఒకటి రెండు గంటలు నిలబడితేనే అయ్యో ఆమ్మో అని బాధపడిపోతాం.  అలాంటిది ఏకంగా 10 గంటలకు ఒకేచోట కదలకుండా నిలబడమంటే నిలబడగలమా చెప్పండి.  ఖచ్చితంగా నిలబడలేం. కానీ, అమెరికాకు చెందిన ఓ మహిళ ఏకంగా 10 గంటలకు పైగా ఒకేచోట కదలకుండా నిలబడి రికార్డ్ సాధించింది.  ఈ సంఘటన అమెరికాలోని టెనస్సి రాష్ట్రంలో జరిగింది.  

టెనస్సి రాష్ట్రంలోని చెత్తనూగ పట్టణానికి చెందిన ఆండ్రియన్ లాంగ్ అనే మహిళ హెరిటేజ్ పార్క్ లో ఉన్న వాల్నట్ చెట్టును పట్టుకొని కదలకుండా ఏకంగా 10 గంటల 5నిమిషాలు నిలబడి గిన్నిస్ బుక్ రికార్డ్ ను సాధించింది.  గతంలో ఇదే మహిళ ఇలానే 8 గంటల 15 నిమిషాలు నిలబడి రికార్డ్ సాధించింది.  ఇప్పుడు ఆమె రికార్డ్ ను ఆమె బ్రేక్ చేసింది.  ఈ కార్యక్రమాన్ని వరల్డ్ రికార్డ్ ట్రీ హగ్ అనే ఫేస్ బుక్ పేజీ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ అందించారు.