వాగులో కుటుంబం గల్లంతు.. ఏడుగురుని కాపాడాడు.. కానీ..!

వాగులో కుటుంబం గల్లంతు.. ఏడుగురుని కాపాడాడు.. కానీ..!

వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తాయి. పొలం పనుల కోసం వెళ్లిన ఓ కుటుంబం వాగులో గల్లంతు అయ్యింది.. షాపూర్ తండాకు చెందిన దశరథ్ కుటుంబం ఉదయం పొలానికి వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో 8 మంది కుటుంబ సభ్యులు కొట్టుకుపోయారు... ప్రణాలకు తెగించిన దశరథ నాయక్.. ఏడుగురు పిల్లలను కాపాడాడు... చివరకు తన భార్యను కాపాడాడు.. కానీ, భార్య అనిత బాయిని రక్షించేంలోపే.. ఆమెప్రాణాలు కోల్పోయింది.  దీంతో, ఆ కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది.. సమయస్ఫూర్తితో ఏడుగురు ప్రాణాలను కాపాడిన దశరథ్‌ నాయక్.. తన భార్య ప్రాణాలను కాపాడుకోలేకపోయాడు.