ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్ భారీ విజయం
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ భారీ విజయంను నమోదు చేసింది. కెప్టెన్ హోల్డర్ (202 నాటౌట్; 23 ఫోర్లు, 8 సిక్సులు) డబుల్ సెంచరీ, వికెట్ కీపర్ షేన్ డౌరిచ్ (116 నాటౌట్; 11 ఫోర్లు, సిక్స్)లు సెంచరీ చేయడంతో.. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌ను 415/6 వద్ద డిక్లేర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని మొత్తం 628 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది.
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ 246 పరుగులకు ఆలౌట్ అయింది. విండీస్ బౌలర్ రోస్టన్ ఛేస్ 8 వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ విలవిలలాడింది. ఓపెనర్లు రోరీ బర్న్స్ (84) మినహా మిగితా వారు ఎవరూ కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ప్రధాన ఆటగాళ్లు జెన్నింగ్స్ (14), బెయిర్ స్టో (30), కెప్టెన్ జో రూట్ (15), స్టోక్స్ (34), బట్లర్ (24), అలీ (0) చేతులెత్తేయడంతో ఇంగ్లాండ్ భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇంగ్లాండ్ చివరి ఏడు వికెట్లను ఛేస్ తీయడం విశేషం. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 289 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 77 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' హోల్డర్‌కి దక్కింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)