అగ్ర దేశాల వాణిజ్య యుద్ధం భారత్‌కు ఎంత వరకు లాభం

అగ్ర దేశాల వాణిజ్య యుద్ధం భారత్‌కు ఎంత వరకు లాభం

 

అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం గత కొంత కాలంగా కొనసాగుతూనే  ఉంది..కరోనా మహమ్మారి వల్ల అది తీవ్ర స్థాయికి చేరింది...అంతర్జాతీయ సమాజం ముందు చైనాను దోషిగా నిలబెట్టాలని అమెరికా అనేక ప్రయత్నాలు చేస్తుంటే...అమెరికాను ఇరకాటంలో పెట్టడంతో పాటు, తన  ఆధిపత్య విధానాన్ని మరో సారి అంతర్జాతీయ వేదిక ద్వారా సుస్థిరం చేసుకోవాలి అమెరికా,దాని మిత్ర దేశాలపై చైనా విమర్శలతో విరుచుకుపడుతుంది...

వాణిజ్య యుద్ధంలో అమెరికా ముందు చైనా చేతులెత్తేసిందా?...చైనా విమర్శలపై అమెరికా వెనక్కి తగ్గిందా?  చైనా మెడలు వంచి వాణిజ్య పోరులో అమెరికా విజయం సాధించిందా ?...ఇలా ఎన్ని విషయాలు చెప్పుకున్న మనలాంటి వర్తమాన దేశాలకు పెద్దగా లాభం ఉండదు..ఎందుకంటే అగ్రదేశాల వాణిజ్య పోరులో భారత్‌ లాంటి అభివృద్ది చెందుతున్న దేశాలకే ఎక్కువ నష్టం జరుగుతుంది తప్ప అభివృద్ధి చెందిన దేశాలపై పెద్దగా ప్రభావం ఉండదని మేధావుల అభిప్రాయం...

తాత్కాలికంగా రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరిన ఆశ్యర్య పడాల్సిన అవసరం లేదు..రెండు అగ్ర దేశాలు వాటి ముఖ్యమైన ప్రయోజనాలను కాపాడుకుంటాయి తప్ప అభివృద్ది చెందిన దేశాల గురించి ఆలోచించవు...ఇద్దరం కలిసి మిగతా దేశాల మార్కెట్లను ఎలా పంచుకుందాం అని ఆలోచిస్తాయి తప్ప  దేశాల అభివృద్దికి తోడ్పడవు ఇది చరిత్ర చెప్పిన సత్యం...ప్రపంచంలో స్వేచ్చా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు అమెరికా నాయకత్వంలోని ధనిక దేశాలు ఉనికిలోకి తెచ్చినదే ప్రపంచవాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ)..ఇదిఅభివృద్ధి చెందిన దేశాల లక్ష్యాలకు అనుకూలంగానే పని చేస్తుంది తప్ప పేద దేశాల వృద్దిలో పాలుపంచుకోదు ఇది జగమెరిగిన సత్యం...

డబ్ల్యుటిఓ సాక్షిగా ,దానిలోని సభ్యదేశాలు వాణిజ్య యుద్ధాలకు తలపడటం అంటే దాని వైఫల్యాన్ని సూచిస్తున్నది...నిజానికి ప్రపంచీకరణ యుగంలో రెండు దేశాల మధ్య తలెత్తే వాణిజ్యపోరు, పరిష్కారం కూడా వాటికే పరిమితం కాదు...ప్రపంచంలో ప్రతి ధనిక దేశమూ చైనాతో వాణిజ్యంలో లోటుతోనే వుంది, కనుక ప్రతి దేశమూ దానిని తగ్గించుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే వుంటుంది...వాటిలో అమెరికా ఒకటి. దిగుమతి సుంకాల పెంపుతో ఎవరైనా చైనాను దెబ్బతీయాలని చూస్తే ఆ విబేధాన్ని వినియోగించుకొనేందుకు మిగతా దేశాలు కాచుకొని వుంటాయి, వున్నాయి. అందుకు పెద్ద వుదాహరణ మన దేశమే...

ప్రపంచంలో నేడు చైనా పెద్ద ఎగుమతిదారే కాదు, పెద్ద వినియోగదారుగా కూడా మారుతోంది. అక్కడి జనాభా కొనుగోలు శక్తి పెరుగుతున్న కారణంగా ఆ మార్కెట్‌ను వదులుకొనేందుకు ఏ ధనిక దేశమూ సిద్దంగా లేదు. అలాంటి దేశంతో మనం అనవసరంగా తగాదా పెట్టుకోవాల్సిన అవసరం ఏముందనే అభిప్రాయం మన కార్పొరేట్‌ రంగంలో క్రమంగా పెరుగుతోంది...చైనా ఆహార, ఔషధ నియంత్రణ శాఖ వద్ద పెండింగ్‌లో వున్న చాలా ఉత్పత్తుల నమోదుకు వేగంగా అనుమతులు తీసుకోవాలని మన ఫార్మారంగం మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెస్తోంది...

తాను ఎగుమతి చేయటమే తప్ప దిగుమతులు చేసుకోవటం లేదన్న విమర్శలను తిప్పికొడుతూ  షాంఘై నగరంలో తొలిసారిగా చైనా దిగుమతుల ప్రదర్శన నిర్వహిస్తోంది... అంటే ప్రపంచ దేశాలన్నీ తమ వుత్పత్తులను అక్కడ ప్రదర్శించాల్సి వుంటుంది. రానున్న ఐదు సంవత్సరాలలో తాము పది లక్షల కోట్ల డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటామని చైనా చెబుతోంది. అందువలన ప్రతి దేశం తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నిస్తుంది...గత కోంత కాలంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందని అనేక మంది ఆర్ఠిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో ఇప్పడు కరోనా మహమ్మారి వల్ల ఇప్పడు ఆర్థిక వృద్ది మరింత దిగజారిపోతుందని ప్రపంచ బ్యాంక్‌ అనేకమార్లు హెచ్చరించింది...

ఇప్పుడు ప్రపంచ దేశాల చూపు భారత్‌పై పడ్డాయి...అధిక వినియోగం,ఎక్కువ మార్కెట్‌ భారత్‌లో ఉంది...వాణ్యం సంక్షోభం నుంచి బయటపడాలంటే మన దేశం ఒక్కటే అభివృద్ధి చెందిన దేశాలకు అవకాశంగా కన్పిస్తున్నాయి..తెర మీదకు అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధంలా ఉన్న అంతర్గతంగా వాటి మార్కెట్ ప్రయోజనాలు అందులో దాగి ఉన్నాయి... ప్రపంచ వ్యాపార సంస్ధల ఒత్తిగి వల్లనే  దేశాలన్ని కరోనా లాక్‌డౌన్‌ సడలిస్తున్నారన్న వార్తలు కూడా ఉన్నాయి...ఆర్థిక ఇంబందులో ఉన్న తమ కంపెనీలపై కరోనా వైరస్‌ మరింత ప్రభావం చూపిందని ద్రవ్య సంస్థలు అంతర్జాతీయ సంస్ధలపై ఒత్తిడి తెచ్చాయని ఆర్ఠిక నిపుణులు పేర్కోంటున్నారు...అనేక దేశాలు విదేశీ  పెట్టుబడులకు ఆయా ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించాలి ద్రవ్య సంస్థలు ఒత్తిడి తెస్తున్నాయి...అందులో బాగంగానే భారత్‌లో కరోనా ప్యాకేజీల పేరుతో అనేక సంస్కరణలు తెచ్చాయి...
దేశంలో కరోనా మహమ్మారి విస్తరణ ప్రారంభం అయినప్పటి నుంచి ముఖ్యంగా జాతీయ మీడియాను పరిశీలిస్తే మరిన్ని సంస్కరణలకు ఇదే మంచి తరుణం అని అనేక మంది మంచి చెడ్డల విశ్లేషణల పేరుతో సలహాలు ఇచ్చారు. నరేంద్రమోడీ 1.0లో ఘోరవైఫల్యం కారణంగా ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు ఐదు శాతం లోపుకు పడిపోయింది. దీనికి కరోనా కూడా తోడు కావటంతో సున్నా లేదా మైనస్‌ కావచ్చని కూడా అంచనాలు వెలువడుతున్నాయి...కరోనా వైరస్‌ రూపంలో అలాంటి అవకాశం వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. గత ఏడాది కాలంలో వడ్డీరేట్లు తగ్గించినప్పటికీ పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో వైఫల్యం తప్ప పురోగతి లేదు. గత కొన్ని సంవత్సరాలుగా విదేశీ వస్తువులకే కాదు, విదేశీ నిధుల ప్రవాహానికి కూడా మన ద్రవ్య మార్కెట్‌ను తెరవాలని ద్రవ్య పెట్టుబడిదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

దేశం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉంది కనుక బయటపడేందుకు ఏదో ఒకటి చేయాలని జనం భావిస్తున్నారు కనుక తమకు ఇదే మంచి అవకాశమని కేంద్ర పాలకులు గత ఏడాదే గ్రహించారు. ప్రభుత్వం తీసుకొనే అప్పులను బాండ్ల పేరుతో వేలం వేస్తారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసే బాండ్లను విదేశీ సంస్ధలు కొనుగోలు చేసేందుకు అనుమతించాలని తొలిసారిగా మోడీ సర్కార్‌ నిర్ణయించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 10బిలియన్‌ డాలర్ల వరకు డాలర్‌ రుణాలు తీసుకుంటారని వార్తలు వచ్చాయి. ఇది గత విధానాల నుంచి వైదొలగటమే. లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలు ఇలాంటి అప్పులు తీసుకొని తిప్పలను కొని తెచ్చుకున్నాయని తెలిసీ ఇందుకు పూనుకున్నారు. ప్రభుత్వాలకు అప్పులు కావాలంటే మన దేశంలోని వారి నుంచే తీసుకోవచ్చు. అయితే అమెరికా, జపాన్‌, ఐరోపా ధనిక దేశాలతో పోల్చితే వడ్డీ రేట్లు మన దేశంలో ఎక్కువ కనుక అప్పు ఖరీదు పెరుగుతుంది. దీన్ని సాకుగా చూపుతూ విదేశీ సంస్ధలకు తలుపులు తెరిచారు...

అమెరికా-చైనా వారు వాణిజ్య యుద్ధంలో మునిగితే దాన్ని ఉపయోగించుకొని మన దేశం చైనా స్ధానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తామని ఎప్పటి నుంచో చెబుతున్నారు కదా ? అదే వాస్తవమైతే గత ఏడాది కాలంలో మన ఎగుమతులు పెరగాల్సింది పోయి తగ్గాయి ఎందుకని ? ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధి రేటు గతేడాది జూలైలో 7.3శాతం వుంటే ఈ ఏడాది జూలైలో 2.1శాతానికి పడిపోవటానికి కారకులు ఎవరు.. వినియోగ వస్తువులను తయారు చేసే కంపెనీలు తమ వస్తువులకు డిమాండ్‌ తగ్గిపోయిందని గగ్గోలు పెడుతున్నాయి. వినియోగవస్తువులను వుపయోగించే విషయంలో సహస్రాబ్ది కుర్రకారు పాత తరాలను మించిపోయింది కదా ! మరి ఆ వస్తువులకు డిమాండ్‌ ఎందుకు తగ్గినట్లు ? చివరకు ఐదు రూపాయల బిస్కెట్‌ పాకెట్లు కూడా సరిగా అమ్ముడు పోవటం లేదని పార్లే కంపెనీ ముంబైలోని విల్‌ పార్లే ఫ్యాక్టరీని మూసివేసింది..

ఇంకా ఇప్పుడు దేశ ప్రజలను మోసం చేస్తూ చైనా కంపెనీలు భారత్‌కు వస్తున్నాయి...లక్షల పెట్టుబడులు వస్తున్నాయని నిరుద్యోగులను మభ్య పెడుతున్నారు మన పాలకులు...ఏ దేశానికి ఐయినా ఆ దేశం విదేశీ మారకం కలిగి ఉంటాయి...మన దేశంలో ఉన్న డాలర్లు ఎన్ని? ఎన్నిరోజుల వరకు అవి సరిపోతాయి?.చైనా దగ్గర ఎన్ని ఉన్నాయి..అనే అంచన వేయకుండా చైనా నుంచి కంపెనీలు వస్తున్నాయంటే అది మన అమాయకత్వమే...ఒక వేల చైనా తన యువాన్‌ విలువ తగ్గిస్తే కార్పోరేట్ కంపెనీలు ఆ దేశం నుంచి రావాడానికి సాహాసం చేస్తాయా?..చైనాతో పోటీ పడి మన రూపాయి విలువ తగ్గించే దైర్యం మనపాలకులు చేస్తారా?... మరో వైపు అమెరికా అధ్యక్షుడు తన దేశ కంపెనీలను తిరిగి తమ దేశానికి రప్పించుకోవడం కోసం అనేక మినహయింపులు ఇస్తున్నాడు...ఇప్పుడు భారత్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలాగా మారే ప్రమాదం ఉన్నది..