ఆర్ఆర్‌పై మయాంక్ రాణిస్తాడా?

ఆర్ఆర్‌పై మయాంక్ రాణిస్తాడా?

ఐపీఎల్-2020 దేశంలో హాట్ టాపిక్‌గా ఉన్న విషయం తెలిసిందే. అందులోనూ కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టులోని మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం మరీ ప్రత్యేకంగా ఉన్నాడు. పంజాబ్‌ జట్టులో తన దైన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతడు మైదానంలో అడుగు పెడితేనే బౌండరీల మోత మోగుతుందని అభిమానుల నమ్మకం. మయాంక్ 10 మ్యాచ్‌లు ఆడి 398 పరుగులు చేశాడు. అయితే గాయం కారణంగా గత కొన్ని మ్యాచులుగా ఆటకు దూరమయిన విషయం తెలిసిందే. దాంతో అతడి అభిమాను కాస్త మనస్తాపానికి గురయ్యారు. అదే సమయంలో పంజాబ్ జట్టు తనదైన టీమ్ వర్క్‌లో వరుసగా 5 మ్యాచ్‌లను గెలిచింది. అయితే ఈ జట్టు నేడు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. అందులో మయాంక్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ వార్త ప్రేక్షకుల్లో కొత్త ఉత్తేజాన్ని ఇస్తోంది. దాంతో పాటుగా ఇన్ని రోజుల విశ్రంతి తరువాత మయాంక్ ఆదే తరహా ఆటను కనబరచగలడా అని అభిమానులు సందేహ పడుతున్నారు.