కాజల్‌తో అయినా విష్ణు కి కలసి వచ్చేనా!? 

కాజల్‌తో అయినా విష్ణు కి కలసి వచ్చేనా!? 

టాలెంట్ ఉన్నా మంచు ఫ్యామిలీ వారి సినిమాలు ఈ మధ్య అంతగా ఆడలేదు. హీరోలు విష్ణు, మనోజ్ కి చాలా గ్యాప్ వచ్చింది. విష్ణు ముందు సినిమాలు 'ఓటర్', 'ఆచారి అమెరికా యాత్ర' బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. బిజినెస్ మేన్ గా బిజీగా ఉన్న విష్ణు ఆ సినిమాల తర్వాత గ్యాప్ తీసుకున్నాడు. రెట్టించిన ఉత్సాహంతో చిన్న సినిమా కాకుండా ‘మోసగాళ్ళు’ పేరుతో ప్యాన్ ఇండియా స్థాయి సినిమా చేశాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు. పాన్ ఇండియా రిలీజ్ అనగానే ఆశ్చర్యపోయిన చాలా మంది... ‘మోసగాళ్ళు’ ట్రైలర్ చూసి ఏదో విషయం ఉందని అంగీకరిస్తున్నారు. అంతే కాదు ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికి కాజల్ కూడా ఓ కారణం. ఆమె పాన్ ఇండియా స్టార్. తెలుగుతో పాటు తమిళ, హిందీ ప్రాంతాలలో ఆమె బాగా పాపులర్. పైగా పెళ్లి తర్వాత విడుదల కాబోతున్న కాజల్ సినిమా ఇది. దాంతో క్యూరియాసిటీ ఉండటం సాధారణ విషయం. ఇక తెలుగులో 'మోసగాళ్ళు' పేరుతో వస్తున్న ఈ చిత్రం ఇతర భాషల్లో ‘అను అండ్ అర్జున్’ పేరుతో రానుంది. ఈ నెల 19న విడుదల కానున్న ఈ సినిమా విష్ణుకు సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.