నాగ్ బర్త్ డే కూడా గిఫ్ట్ రెడీ చేస్తున్నారట

నాగ్ బర్త్ డే కూడా గిఫ్ట్ రెడీ చేస్తున్నారట

‘మన్మథుడు’ సీక్వెల్ నిరాశపర్చడంతో ఈసారి నాగార్జు న ఏ సినిమాతో వస్తారోనని ఎదురు చూస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఆ ఎదురు చూపులకు తగ్గట్టు గానే చాలా డిఫరెంట్ గా వచ్చేలా కనిపిస్తున్నారాయన. నాగార్జున హీరోగా ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు డైరెక్టర్ అహిషోర్ సాల్మన్. ఈ మూవీ ఫస్ట్‌ లుక్ ఆ మధ్య విడుదలయ్యింది. నాగ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ లాగా కనిపించడంతో సినిమా పై ఆసక్తి ఏర్పడింది . ఇందులో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ వర్మగా నాగ్ నటిస్తున్నారు. ఆయన్ని పోలీస్ శాఖ లో అంతా వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. ఆ క్యాడర్ లో ఆయన ఏ ఆపరేషన్స్‌ చేపడతారనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిం దే. నిజ ఘటనల ఆధారంగా నిరంజన్ రెడ్డి , అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెలలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజులతో పాటు కింగ్ నాగార్జున పుట్టిన రోజు కూడా ఉన్న విషయం తెల్సిందే. చిరంజీవి బర్త్ డేకు ఆచార్య నుండి ఫస్ట్ లుక్ రాబోతుంది. మహేష్ బాబు పుట్టిన రోజుకు సర్కారు వారి పాట చిత్రంకు సంబంధించి ఒక పాటను విడుదల చేయబోతున్నారు. ఇక నాగార్జున బర్త్ డే రోజు ఏం రాబోతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్ కోసం వైల్డ్ డాగ్   సినిమా టీజర్ రాబోతుందనే అనధికారిక ప్రకటన వచ్చేసింది.మరో వైపు నాగార్జున బిగ్ బాస్ సీజన్ 4 కు సిద్దం అయ్యాడు.