భార్య వికృత శృంగారం..! భర్త ఆత్మహత్య..

భార్య వికృత శృంగారం..! భర్త ఆత్మహత్య..

ఓ మహిళ వికృత శృంగార చేష్టలు ఆమె భర్తను బలితీసుకున్నాయి.. మగాడిలా ప్రవర్తిస్తూ.. కాలేజీకి వెళ్లే అమ్మాయిలను ట్రాప్ చేయడం.. ఆపై కోర్కెలు తీర్చుకోవడం ఆ మాయలేడీకి అలవాటుగా మారింది. ఓ యువతి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే భార్య వికృత శృంగార చేష్టలు బయటకు రావడంతో అవమాన భారంతో ఆమె భర్త మూడంతస్తుల బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే సంతనూతలపాడు మండలం ఎనికపాడు గ్రామానికి చెందిన గోనుగుంట్ల ఏడుకొండలు... ఒంగోలు మారుతీ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆటోడ్రైవరైన ఏడుకొండలుకు సుమలత అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఏడుకొండలు పరిచయం కాకముందే తాళికట్టిన భర్తను వదిలేసిన సుమలత వికృత శృంగారానికి అలవాటు పడింది. ఇంటర్‌నెట్‌లో సెక్స్‌ వీడియోలు చూస్తూ లెస్బియన్‌గా మారింది. కోర్కెలు తీర్చుకునేందుకు కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు వల వేసేది. వారికి డబ్బు ఆశచూపడం.. వారి అవసరాలు తీర్చడం వంటి పనులు చేస్తూ ట్రాప్ చేసేది సుమలత. ఇదే క్రమంగా ఇంటర్ చదువుతున్న ఓ మైనర్ యువతిని మాయమాటలతో ఇంటికి తీసుకెళ్లింది. కూల్ డ్రింక్‌లో మత్తు కలిపి ఇచ్చింది. ఆ యువతి స్పృహ కోల్పోయిన తర్వాత తన కోరికలు తీర్చుకుంది. స్పృహలోకి వచ్చిన తరువాత ఆ యువతికి తనపై ఏదో జరిగినట్టు అనుమానం వచ్చింది. తల్లిదండ్రులతో కలిసి ఈనెల 4వ తేదీన జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ కి ఫిర్యాదు చేసింది. 

పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుమలతతో పాటూ ఆమె భర్త ఏడుకొండలు, మరో యువకుడు వంశీకృష్ణలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగానే సుమలతలోని మరో కోణం బయటపడింది. ఆమె వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. అయితే సుమలత నలుగురికీ తెలియడంతో అవమానంగా భావించిన ఏడుకొండలు ఇంటిపై నుండి కిందకు దూకేశాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడు. పోలీసు విచారణలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఇంట్లో నుంచి సెక్స్‌ టాయ్స్ తో పాటు పలు లెటర్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సెక్స్‌ టాయ్స్‌ను ఉపయోగించే సమయంలో సుమలత పురుషుల మాదిరిగా దుస్తులు వేసుకోవడం.. గొంతుమార్చి మగాళ్ల మాదిరి మాట్లాడటం, బైక్‌ నడపటం వంటి పనులు చేసేదని గుర్తించారు పోలీసులు. దీంతో సుమలత ఈ విధంగా ఎంతమందిని ట్రాప్‌ చేసిందనే దానిపై ఆరా తీస్తున్నారు దర్యాప్తు అధికారులు.