భర్త హత్యకు ప్లాన్... సుపారీ గ్యాంగ్‌ను దించింది... చివరకు...?

భర్త హత్యకు ప్లాన్... సుపారీ గ్యాంగ్‌ను దించింది... చివరకు...?

తన సుఖానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలని ఓ ఇల్లాలు స్కెచ్ చేసింది.. దాని కోసం ప్రియుడి సహాయం తీసుకుంది.. తనపై మరకపడకుండా సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దింపింది.. ఆ తర్వాత వాళ్లు చెప్పిన ప్లాన్స్ అమలు చేస్తూ వచ్చింది.. చివరకు భర్తకు అనుమానం వచ్చి నిలదీయడంతో చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి పరారైంది... భర్త పోలీసులను ఆశ్రయించడంతో తీగలాగితే డొంక మొత్తం కదిలినట్టు... మ్యాటర్ మొత్తం బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలో 15 ఏళ్ల క్రితం తన అక్క కూతురు పెళ్లి చేసుకున్నాడో వ్యక్తి.. వాళ్లకు ఇద్దరు కూతుర్లున్నారు.. అయితే, 15 ఏళ్ల తర్వాత ఆమెకు భర్తపై అయిష్టత ఏర్పడింది.. దానికి కారణం వివాహేతర సంబంధమే.. అదే ఊరిలో ఉంటును గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. తరచూ అతడిని కలిసేది ఆమె.. వారి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.. అయితే, తమ మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది.. ఎలాగైనా భర్తను అడ్డుతొలగించాలనే నిర్ణయానికి వచ్చారు ఆ ఇద్దరు.. దీనికోసం గుంటూరు జిల్లా నుంచి 9 మంది సుపారీ గ్యాంగ్‌ను రప్పించారు. తన భర్తను చంపేందుకు ఆమె రూ.8 లక్షల సుపారీ కూడా అప్పజెప్పింది. అయితే, ఆ గ్యాంగ్ డైరెక్ట్‌గా రంగంలోకి దిగకుండా.. భర్తకు అన్నంలో విషం కలిపి పెట్టాలని సలహాఇచ్చారు.. అమె అదేప్లాన్ ఫాలో అయినా.. అది వర్కౌట్ కాలేదు.. దీంతో మళ్లీ సుపారీ గ్యాంగ్‌ను ఆశ్రయించింది.. ఈసారి మరో ప్లాన్ చెప్పారు.. ఓ విషపు ఇంజెక్షన్ ఆమెకు ఇచ్చి.. భర్తుకు ఇవ్వాలని చెప్పారు.. ఆ ఇంజెక్షన్‌ను భర్తను పొడవాలని చూసిన ఆమె ప్రవర్తను చూసి డౌట్ వచ్చిన భర్త.. ఆమెను నిలదీయడంతో చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి పరారైంది. భార్య కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త... పోలీసులు ఆమె మొబైల్ నంబర్‌ను ట్రాక్ చేయగా గుంటూరులో ఉన్నట్లు తేలింది. నేరుగా వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించగా మొత్తం విషయాన్ని బయటపెట్టింది.. దీంతో.. ఆమెను, ఆమె ప్రియుణ్ని, 9 మంది సుపారీ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు.