కరోనా కాలం: భర్తకు పాజిటివ్ వచ్చిందని... భార్య వదిలేసి వెళ్ళిపోయింది...  

కరోనా కాలం: భర్తకు పాజిటివ్ వచ్చిందని... భార్య వదిలేసి వెళ్ళిపోయింది...  

కరోనా వైరస్ వలన సమాజంలో వస్తున్న మార్పుల  సంగతి పక్కన పెడితే, సంసారంలో చిచ్చులు పెడుతున్నది.  తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి  డయాలసిస్ చేయించుకోవడానికి కాకినాడ వెళ్ళాడు.  కాకినాడ ఆసుపత్రిలో డయాలసిస్ తో పాటుగా కరోనా టెస్టులు నిర్వహించారు.  ఆ తరువాత ఆ వ్యక్తి తన రామచంద్రపురం వెళ్లేందుకు బస్సు ఎక్కాడు.  

బస్సులో అతనికి, అతని భార్యకు సంబంధించిన  విషయాలను నోట్ చేసుకున్నారు.  బస్సు కరప  వద్దకు వచ్చే సరికి అతనికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు మెసేజ్ వచ్చింది.   బస్సును కరప మార్కెట్ వద్ద ఆపేసి భార్య భర్తను దించేశారు. బస్సులో నుంచి దిగిన తరువాత భర్తను అక్కడే వదిలేసి భార్య వెళ్ళిపోయింది. బాధితుడు ఒక్కడే నిస్సహస్థితిలో ఉండటం గమనించిన పోలీసులు కాకినాడ ప్రభుత్వ  ఆసుపత్రికి సమాచారం అందించారు.