మైనర్‌ మరదలిపై బావ అత్యాచారం.. గర్భిణి అయిన భార్య ఏం చేసిందంటే..?

మైనర్‌ మరదలిపై బావ అత్యాచారం.. గర్భిణి అయిన భార్య ఏం చేసిందంటే..?

ఆమె నిండు గర్భిణి.. భర్త దగ్గరే ఉంటుంది.. అయితే, తనకు సహాయంగా ఉంటుందని తన 15 ఏళ్ల చెల్లిని ఇంటికి తెచ్చుకుంది... అక్కకు ఆ చెల్లి అన్ని పనులు సహాయం చేస్తుంది.. కానీ, తాగుడుకు బానిసమైన ఆమె భర్త కన్ను ఆ మైనర్ బాలికలపై పడింది.. భార్య లేని సమయం చూసుకుని మైనర్‌ అయిన తన మరదలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆ బాలిక ప్రతిఘటించినా.. బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు.. ఇక, ఈ విషయం గర్భిణికి తెలియడంతో తట్టుకోలేకపోయింది... నిండు గర్భిణి అయిన ఆమె.. తన భర్త లేకుంటే ఎలా అనే ఆలోచన కంటే.. తన చిన్నారి చెల్లికి ఇంతి అన్యాయం చేస్తాడా? అనే కోపమే ఆమెలో ఎక్కువైపోయింది.. దీంతో, కట్టుకున్న భర్తనే దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత శవాన్ని ఇంటి వెనక పాతిపెట్టి.. అనంతరం పోసుల ఎదుట లొంగిపోయిన ఘటన రాజస్థాన్‌లో సంచలనం సృష్టించింది.

వివారల్లోకి వెళ్తే.. శిఖర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన నిండు గర్భిణి.. తన భర్తని దారుణంగా హత్య చేసింది.. తొమ్మిది నెలల నిండు గర్భంతో ఉన్న ఆమెకు చేదోడువాదోడుగా ఉండేందుకు ఎనిమిదో తరగతి చదువుతోన్న ఆమె చెల్లెలు.. అక్క ఇంటికొచ్చింది. కామంతో కళ్లుమూసుకుపోయిన బావ మరదలిపై దారుణానికి ఒడిగట్టాడు.. ఆ విషయం తెలిసి కోపంతో ఊగిపోయిన భార్య.. ఆ విషయాన్ని జీర్ణించుకోలేక.. భర్తని గొడ్డలితో నరికి అతి కిరాతకంగా హత్య చేసింది.. ఆ తర్వాత ఇంటి వెనుక పెరట్లోకి భర్త శవాన్ని లాక్కెళ్లి గొయ్యి తవ్వి పాతిపెట్టింది.. ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయింది.. కేసు నమోదు చేసిన పోలీసులు.. గర్భిణి అదుపులోకి తీసుకున్నారు.. ఇక, ఆమె చెల్లెలిపై అత్యాచారం జరిగిందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి వైద్య పరీక్షలకు పంపించారు పోలీసులు అధికారులు. మొత్తానికి తన చెల్లి జీవితాన్ని ఆగం చేసినోడు తన భర్త అయినా సరే... నిండు గర్భిణి అయినా ఆమె హత్య చేయడం సంచలనంగా మారింది.