హ‌త్య కేసులో ట్విస్ట్.. ప్రియుడితో క‌లిసి భార్యే ఆ ప‌నిచేసింది..

హ‌త్య కేసులో ట్విస్ట్.. ప్రియుడితో క‌లిసి భార్యే ఆ ప‌నిచేసింది..

హైద‌రాబాద్ శివారులో జ‌రిగిన ఓ ప్రీప్లాన్డ్ మ‌ర్డ‌ర్ కేసును ఛేదించారు మేడ్చ‌ల్ పోలీసులు.. ప్రియుడితో క‌లిసి.. క‌ట్టుకున్న భ‌ర్త‌నే భార్య దారుణంగా హ‌త్య చేసిన‌ట్టు తేల్చారు.. వివ‌రాల్లోకి వెళ్తే.. సైదొనిగడ్డ తండాకు చెందిన సురేష్, బబిత భార్యాభర్తలు. అయితే, బ‌బిత‌కు  దుండిగల్ తండాకు చెందిన ప్రేమ్‌సింగ్‌కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో, అడ్డుగా ఉన్న భర్త సురేష్‌ను అడ్డు తొలగించుకోవాలని మే నెలలో బబిత.. ఆమె ప్రియుడు ప్రేమ్‌సింగ్‌తో క‌లిసి కుట్ర చేసింది.. దీంట్లో భాగంగా.. ప్రేమ్‌సింగ్ తన స్నేహితులతో కలిసి ప్లాన్ చేశాడు.. సురేష్.. ఆఫీసు విధులు ముగించుకుని తిరిగి ఇంటివైపు వ‌స్తున్న స‌మ‌యంలో యాడారం ద‌గ్గ‌ర‌ మే 23వ తేదీన‌ డీసీఎంతో ఢీకొట్టి.. ప్ర‌మాదంగా చిత్రీక‌రించి.. ఆ త‌ర్వాత గొంతు నులిమి చంపేశారు.. సురేష్ కుటుంస‌భ్యుల‌కు అనుమానం వ‌చ్చి.. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో.. విచార‌ణ‌లో జ‌రిగిన దారుణం వెలుగు చూసింది. 

సురేష్ కుటుంబ‌స‌భ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. మృతుడి భార్య బబిత, ప్రియుడు ప్రేమ్‌సింగ్‌తో పాటు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మ‌రో న‌లుగురు ప‌రారీలో ఉన్న‌ట్టు చెబుతున్నారు డీసీపీ ప‌ద్మ‌జారెడ్డి.. డీసీఎంతో ఢీకొట్టి ప్ర‌మాదంగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేసిన నిందితులు.. ఆ త‌ర్వాత కారులో ఆస్ప‌త్రికి తరలిస్తున్నట్టుగా డ్రామా ఆడారు.. దారిలోనే గొంతు పిసికి దారుణంగా హ‌త్య చేశారు.. కాగా, 2012 నుండే బబిత, ప్రేమ్ సింగ్ మ‌ధ్య ప‌రిచ‌యం ఉంది.. కుటుంబ‌స‌భ్యులు 2014లో ప్రేమ్ సింగ్ పై కేసు పెట్ట‌డంతో.. జైలుకు వెళ్లాడు.. ఇక‌, ఇదే స‌మ‌యంలో స‌బిత‌, సురేష్‌కు వివాహం జ‌రిన‌ట్టు తెలిపారు డీసీపీ.. అయితే, 2019లో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఇంటి నుండి వెళ్లిపోయిన బ‌బిత‌ను మహబూబ్‌నగర్ లో బంధువుల ఇంట్లో గుర్తించి.. ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇప్పించి పంపించారు.. సురేష్‌తో త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతుండ‌గా.. ప్రియుడు ప్రేమ్ సింగ్‌తో త‌న సంబంధాన్ని కొన‌సాగిస్తూనే ఉంది బ‌బిత‌. ఇక‌, అడ్డు తొల‌గించుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చి.. ప్లాన్ చేశారు.. కానీ, మే 15, 16 తేదీల్లో కూడా సురేష్‌ను హత్య చేసేందుకు చేసిన ప్లాన్ ఫెయిల్ అయ్యింది.. మొత్తానికి మే 23వ తేదీన ప్లాన్ ప్ర‌కారం హ‌త్య చేసిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు.