శాడిస్ట్ భర్త...మర్మాంగం కోసి చంపేసిన భార్య

శాడిస్ట్ భర్త...మర్మాంగం కోసి చంపేసిన భార్య


పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నర్సాపురం మండలం మక్కినవారిగూడెంలో కుటుంబ కలహాలతో భర్తను హత్య చేసింది ఓ భార్య. మంచానికి భర్తను కట్టేసి చంపి ఏమీ తెలియనట్టు మృతుని తమ్మునికి ఫోన్ చేసి తాళం వేసి వచ్చానని చెప్పింది. దీంతో అతడు వెళ్లి చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పారావు, లక్ష్మీ అనే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బంధువులు సర్ది చెబుతున్నా ఫలితం లేకపోయింది. 

లాక్‌డౌన్ కూడా తోడు కావడంతో మరింత గొడవ పడేవారు. అప్పారావు తనకు డబ్బులు కావాలనే వేధించేవాడు. దీంతో లక్ష్మి ప్లాన్ చేసి మరీ రాత్రి  నిద్రపోతున్న భర్తను మంచానికి కట్టేసింది. కొడవలితో మర్మాంగాలు కోసి పరారైంది. అప్పారావు నరకయాతనతో కేకేలు వేసి తీవత రక్తస్రావంతో అతడు అక్కడికకట్టే చనిపోయాడు. పోలీసులు లక్ష్మిపై కేసు నమోదు చేసుకుని ఆమె కోసం గాలిస్తున్నారు.