భర్త ఉండగానే మరిదితో రాసలీలలు... చివరకు... 

భర్త ఉండగానే మరిదితో రాసలీలలు... చివరకు... 

అక్రమ సంబంధాలు మనిషిని ఎలా మార్చేస్తుంటాయో చెప్పక్కర్లేదు.  ఇలాంటివి  బయటపడనంత వరకు బాగానే ఉంటాయి.  కానీ, బయటపడిన తరువాత వచ్చే ఇబ్బందులు దారుణంగా ఉంటాయి.  బంగారం లాంటి కాపురాలు కూలిపోతాయి.  పోలీసు స్టేషన్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది.   భర్త ఉండగానే ఓ భార్య తన మరిదిపై కన్నేసింది.  అతనితో స్నేహం పెంచుకొని లొంగదీసుకుంది.  

చాటుమాటుగా సాగుతున్న ఈ వ్యవహారం భర్తకు తెలియడంతో షాక్ అయ్యాడు.  భార్యను నిలదీశాడు.  భర్త మందలించినప్పటికి ఆ భార్య మారలేదు.   పైగా తన అక్రమసంబంధానికి అడ్డు వస్తున్నాడని మరిదితో కలిసి అడ్డుతొలగించుకోవాలని అనుకుంది.  పధకం  ప్రకారం,  మరిది మరో ఇద్దరి సహాయంతో భర్త మెడకు తాడు బిగించి చంపేసింది.  ఆ తరువాత భర్త శవాన్ని ఓ ప్రాంతంలో పడేసి సైలెంట్ గా వచ్చారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది.  ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.