డబ్బులు అడుగుతున్నాడని... అపరకాళికలా మారింది... చివరకు  

డబ్బులు అడుగుతున్నాడని... అపరకాళికలా మారింది... చివరకు  

భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే.  కాపురం అంటేనే సర్దుకుపోవడం.  గొడవలు వచ్చిన ప్రతిసారి తన్నుకుంటే దానిప్రభావం పిల్లలపై పడుతుంది.  వారి భవిష్యత్తు నాశనం అవుతుంది.  ఆవేశం వచ్చినపుడు ఒకటికి పదిసార్లు అలోచించి నిర్ణయం తీసుకోవాలి.  అలా కాకుండా ఆవేశానికి పోయి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే జీవితం వృధా అవుతుంది.  ఇలాంటి నిర్ణయమే ఓ మహిళ తీసుకుంది.  తన కాపురాన్ని చేజేతులారా తానే పాడుచేసుకుంది.  

నర్సింహారావు, జ్యోతి దంపతులు ఖమ్మంజిల్లాలోని గొల్లబయ్యారంగ్రామంలో నివాసం ఉంటున్నారు.  వీరు కూలి చేసుకొని జీవనం సాగిస్తుంటారు.  అయితే, వీరి కాపురంలో తరచుగా ఆర్ధికంగా ఇబ్బందుల కారణంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.  అయితే, భర్త పదేపదే డబ్బులు అడిగి విసిగిస్తుండటంతో భార్య జ్యోతికి సహనం తగ్గిపోయింది.. ఒక్కసారిగా ఆమెలో ఉన్న ఆవేశం బయటకు వచ్చింది.  ఆ ఆవేశంలో అపరాకాళికలా మారింది.  చేతిలో ఉన్న కూరగాయలు కోసే కత్తితో భర్తపై దాడి చేసింది.  ఈ దాడిలో భర్త నర్సింహారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  ఆవేశంలో భార్య తీసుకున్న నిర్ణయంతో ఆమె ఇద్దరు పిల్లలు అనాధలుగా మారిపోయారు.