భర్తను కొట్టి చంపిన భార్య..

భర్తను కొట్టి చంపిన భార్య..

భర్త వేధింపులను మౌనంగా భరిస్తూ వచ్చిన ఓ మహిళ.. చివరకు తన భర్తనే కొట్టిచంపిన ఘటన కృష్ణా జిల్లాలు జరిగింది. జిల్లాలోని చందర్లపాడు మండలం మునగాలపల్లిలో భార్య చేతిలో భర్త హతమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే పిడతల సురేష్ అనే వ్యక్తి మద్యానికిబానిసై నిత్యం భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. భర్త వేధింపులకు విసిగిపోయిన భార్య.. శనివారం రాత్రి తాగివచ్చిన భర్తపై ఇనుపరాడ్డుతో దాడికి పాల్పడింది. ఇనుపరాడ్డు సురేష్ తలపై బలంగా తగలడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న చందర్లపాడు పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.