ప్రియుడితో గోవాకు భార్య... పీఎస్‌కు భర్త...

ప్రియుడితో గోవాకు భార్య... పీఎస్‌కు భర్త...

ఆమె వయస్సు 35... ప్రియుడి వయస్సు 25
భర్తకు తెలియకుండా రహస్యంగా ప్రియుడితో రాసలీలలు
భర్త, ఇద్దరు కుమార్తెల్ని వదిలి వెళ్లిపోయిన మహిళ
భార్యకు తెలియకుండా ఆమె కారుకు జీపీఎస్ అమర్చిన భర్త
ప్రియుడితో కలిసి హైదరాబాద్ నుంచి గోవాకు కారులో వెళ్లిపోయిన భార్య
జీపీఎస్ ద్వారా భార్య జాడ తెలుసుకున్న భర్త
ప్రియుడితో ఉన్న తన భార్యను పట్టుకోవాలని పోలీసుల్ని కోరిన భర్త

కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఆమె వ్యాపారవేత్త భార్య.. భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంతోషంగా సాగిపోతోన్న కాపురంలో మూడో వ్యక్తి ప్రవేశించాడు. తనకంటే వయస్సులో పదేళ్ల చిన్నోడైన యువకుడితో గుట్టుగా ప్రేమాయణం సాగించింది ఆ వివాహిత. అనుమానించిన భర్త ఆమె కారుకు జీపీఎస్ అమర్చాడు. భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలి ప్రియుడితో కలిసి గోవాకు కారులో వెళ్లిపోయింది. పెళ్లి చేసుకుని వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసి... నమ్మకద్రోహానికి పాల్పడిన భార్యపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆమె వయస్సు 35, ప్రియుడి వయస్సు 25... వయస్సులో పదేళ్ల చిన్నోడితను. పేరు మాధవ్... ఇతనికింకా పెళ్లి కాలేదు. ఆమెకు పెళ్లై ఇద్దరు కుమార్తెలున్నారు. భర్త బిజినెస్ పనిమీద హైదరాబాద్, నెల్లూరు, విజయవాడకు క్యాంపులకు వెళ్తుంటాడు. ఈమె కూడా వ్యాపారపనులు నిర్వహించేది. ఓ రోజు కారు వాష్ చేయించేందుకు వెళ్లిన ఆమెకు వాష్ సెంటర్ యజమానైన కుర్రోడు పాతికేళ్ల మాధవ్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ కలిసి చాటింగ్ లు చేసుకోవడం, రహస్యంగా రాసలీలలు కొనసాగించేవారు. భర్త, పిల్లల్ని పట్టించుకునేది కాదు. ఓ రోజూ వారిద్దరూ అమీర్ పేట్ లో రహస్యంగా కలిసుండగా వారిద్దర్నీ భర్త పట్టుకున్నాడు. తనింకా తప్పు చేయనంది... మన్నించమంది. పుట్టింటికి వెళ్లిపోతానని చెప్పిన ఆమె కారులో ప్రియుడ్ని ఎక్కించుకుని గోవాకు పారిపోయింది. గోవాలో ఓ హోటల్లోకి కారు చేరుకున్నట్టు జీపీఎస్ ద్వారా భర్త తెలుసుకుని ఎస్ఆర్ నగర్ పోలీసుల్ని ఆశ్రయించాడు. తనని మోసం చేసి నమ్మకద్రోహానికి పాల్పడ్డ తన భార్యను, ఆమె ప్రియుడు మాధవ్ ను పట్టుకోవాలని పోలీసుల్ని వేడుకుంటున్నాడు. ఆమె దగ్గర తన కూతుళ్లు ఉంటే వారు చెడుదోవలోకి వెళ్లే ప్రమాదం ఉందని... పిల్లల్ని తనకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు.