ప్రియురాలితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన భర్త... చితక్కొట్టిన భార్య...!!

ప్రియురాలితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన భర్త... చితక్కొట్టిన భార్య...!!

అక్రమ సంబంధాలు మనిషిని ఎంతలా కుంగదీస్తాయో చెప్పక్కర్లేదు.  అక్రమ సంబంధాలు బయటపడనంత వరకు బాగానే ఉంటాయి.  ఒక్కసారి బయటకు వచ్చాయి అంటే పరువు మొత్తం వీధిన పడుతుంది.  దాని వలన రెండు కుటుంబాల వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  ఇల్లీగల్ అఫైర్ డేంజర్ దాని జోలికి పోవద్దని చట్టాలు, ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి.  కానీ, వినకుండా చాలామంది గుట్టుగా ఈ సంబంధాలు నడుపుతూనే ఉన్నారు.  ఇబ్బందుల్లో పడిపోతున్నారు.  

వరంగల్ లో ఇలాంటి సంఘటనే జరిగింది.  లాక్ డౌన్ సమయంలోనూ ఓ భర్త బయటకు వెళ్తుండటం ఇంటికి లేటుగా రావడం చేస్తున్నాడు.  దీంతో అయన భార్య అనేకమార్లు నిలదీసింది.  పొంతనలేని సమాధానం చెప్పడంతో పాటుగా భార్యను కొట్టడం చేస్తున్నాడట.  దీంతో భర్తపై అనుమానం కలిగిన భార్య, ఎలాగైనా భర్తను చేస్తున్న పనులను కనిపెట్టాలని అనుకుంది.  భర్త అక్రమసంబంధం గురించి తెలుసుకున్న భార్య షాక్ అయ్యింది.  వరంగల్ లోని బీట్ బజార్లో ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకొని బంధువులతో కలిసి వెళ్లి ప్రియురాలి ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.  భర్తను, ప్రియురాలిని చితకబాదింది.