భర్తను చితకబాదిన భార్య

భర్తను చితకబాదిన భార్య

వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ ప్రబుద్ధుడిని అతని భార్య చితకబాదింది. వెంటాడి మరీ తరిమికొట్టింది. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ఏవోగా పనిచేసిన హరిప్రసాద్‌కు నిర్మలతో పెళ్లైంది. నిర్మల.. నాగినేనిపల్లె స్కూల్‌లో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. హరిప్రసాద్ ఇటీవల మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ కారణంతోనే ఇటీవల ఆయన విధుల నుంచి సస్పెండయ్యాడు. ఈ క్రమంలో ప్రియురాలితో ఓ ఇంట్లో కలిసి ఉన్న భర్తను నిర్మల పట్టుకుంది. భర్తను బయటకు ఈడ్చి చితకబాదింది. అనంతరం పోలీసులకు అప్పగించింది.