ఫోన్ కొనలేదని భర్తపై దాడి చేసిన భార్య

ఫోన్ కొనలేదని భర్తపై దాడి చేసిన భార్య

ఫోన్‌ కొనివ్వలేదని భర్తపై ఇనుప రాడ్‌తో దాడి చేసింది ఓ భార్య. తీవ్ర గాయాలపాలైన భర్త హాస్పిటల్ పాలయ్యాడు. కాకినాడ దుమ్ములపేట తారకరామ నగర్‌కు చెందిన పర్ల నిత్యానందం, కుమారి ప్రియదర్శిని అనే భార్యాభర్తల సెల్ ఫోన్ కోసం గొడవ పడ్డారు. గత కొంతకాలంగా సెల్‌ఫోన్‌ కొనివ్వమని భార్య  ప్రియదర్శిని భర్త నిత్యానందాన్ని కోరుతోంది. త్వరలో కొంటానని భర్త  చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో మరోమారు భార్య  ప్రియదర్శిని సెల్‌ ఫోన్ కోసం గొడవ పెట్టింది. ఏడాది వయసున్న పిల్లాడిని కొట్టి ఏడిపించింది.

ఆ సమయంలో భర్త  నిత్యానందం పిల్లాడిని తన దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఎన్నిసార్లు అడిగినా ఫోన్‌ మాత్రం కొనివ్వట్లేదని కోపోద్రిక్తురాలైన భార్య ప్రియదర్శిని ఫ్యాన్‌ రాడ్‌ తీసుకుని భర్త నిత్యానందం తలపై గట్టిగా మోదింది. తీవ్ర రక్తస్రావంతో ఉన్న నిత్యానందాన్ని స్థానికులు కాకినాడ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం  నిత్యానందం కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. కొద్దీ రోజులుగా తరచూ గొడవ పడుతున్న భార్యాభర్తలు విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇరువురు మధ్య రాజీ కుదిర్చి కాపురం చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు పెద్దలు.