పెళ్లైన 20రోజులకే పక్కా ప్లాన్‌తో భర్తపై దాడి!

పెళ్లైన 20రోజులకే పక్కా ప్లాన్‌తో భర్తపై దాడి!

వివాహం జరిగి 20 రోజులు కూడా గడవలేదు... ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన టైం లోనే భర్త మర్డర్‌కు నవ వధువు ప్లాన్ వేసిన ఘటన శ్రీకాకుళంలో జరిగింది. ఇంట్లో వాళ్లు ఇష్టంలేని పెళ్లిచేయడంతో కక్షపెంచుకున్న ఆ యువతి... ఎలాగైనా భర్తను హతం చేయాలనుకుంది. సంతబొమ్మాళి మండలం గోడలామ్ గ్రామంలోని అత్తగారింటి నుంచి పుట్టింటికి వెళ్తున్న సమయంలో అదునుచూసి భర్తపై దాడి చేసింది. భర్తను హత్య చేయాలని ముందుగా ప్లాన్ చేసుకున్న యువతి... రైల్వే తోటల సమీపంలో భర్త షర్ట్‌ కాలర్ పెట్టుకుని కొంత దూరం జరిపి... మెడపై ఒక్కసారిగా కత్తితో పొడిచింది... తన భార్య సరదాగా తనతో ఆడుకుంటుందని భావించిన యువకుడు... దాడి చేయడంతో ఒక్కసారిగా షాక్‌గురయ్యాడు. వెంటనే బైక్ ఆపి కేకలు పెట్టాడు... ఇదే సమయంలో మరోసారి దాడికి యత్నించగా... అడ్డుకునే ప్రయత్నంలో యువకుడి చేతికి కూడా గాయాలయ్యాయి. యువకుడి అరుపులతో పక్కనే తోటల్లో ఉన్నవారు వచ్చి... వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడి పరిస్థితి నిలకడగా ఉంది. వీరిద్దరకి ఈనెల 9వ తేదీనే వివాహం జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.